KTR: కేటీఆర్ గత కొద్దిరోజులుగా నన్ను అరెస్టు చేసిన నేను భయపడేది లేదని ఏ కేసులో అరెస్టు చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన కటకటాలకు వెళ్లాలనే కల అతి త్వరలోనే నెరవేరబోతుందని తెలుస్తుంది. కేటీఆర్ అరెస్టుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయన అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ-కార్ రేస్‌లో నాటి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందానికి ముందుగానే నిధులు చెల్లించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, మాజీమంత్రి కేటీఆర్‌పై కేసునమోదు చెయ్యడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఇద్దరు అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
HMDA, RBI అనుమతి లేకుండానే రూ. 46 కోట్లు బదిలీ చేశారు. ఇక ఈ విషయంలో విచారణ జరపడం కోసం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని పరిశీలించిన గవర్నర్.. న్యాయ సలహా అనంతరం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా గవర్నర్ ఆమోదంతో ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కొత్త ములపు తిరగనుంది.
ఇక ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మారింత దూకుడు కనబరుస్తుందనే విషయం మనకు తెలిసిందే. ఏ విషయంలో కేటీఆర్ ను అరెస్టు చేయాలా అని ఎంతగానో ఎదురు చూస్తున్నా అధికార ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి అయితే అతి త్వరలోనే కేటీఆర్ ఊచలు లెక్కబెడతారని ఆ సమయం దగ్గర పడుతోందని తెలుస్తోంది. మరి గవర్నర్ నిర్ణయంపై కేటీఆర్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.