వచ్చేది టిఆర్ ఎస్ ప్రభుత్వమే, లేదంటే రాజకీయ సన్యాసం

2019 ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది కెటి రామారావే అనుకుంటున్నపుడు ఆయన అసక్తి కరమయిన విషయం చెప్పారు.

తనకు పదవుల మీద ఆశ లేదని, అసలు తనకి మంత్రి పదవే చాలా గొప్ప అని అన్నారు.  ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని అన్నారు.

 ‘ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ రావు మరొక  15 ఏళ్లు ఉండాలనేది నాకోరిక. అది తప్ప నాకు మరో కోరిక లేదు.  కేసీఆర్ వంటి నాయకుడు రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నదే నా అకాంక్ష,’ అని కెటియార్ అన్నారు.

ఈ సారి టి ఆర్ ఎస్ కు  అసాధారణ విజయం లభిస్తుందని చెబుతూ  టీఆర్‌ఎస్ తనకు తానుగా  అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో కొనసాగనని,  రాజకీయ సన్యాసం తీసుకుంటానని కెటిఆర్ ధీమాగా ప్రకటించారు.  ‘మళ్లీ మీకు కనిపించను.నా సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌కు, ఇతర నేతలకు ఉందా?’ అని సవాల్ విసిరారు.