KTR: రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని అందుకే టార్గెట్ చేశారు… మళ్లీ రచ్చ చేస్తున్న కేటీఆర్?

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఈయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వివాదాన్ని ఇంత పర్సనల్గా తీసుకోవడానికి కారణం లేకపోలేదని తెలిపారు. కేవలం ఒక కారణంతోనే బన్నీని టార్గెట్ చేశారని కేటీఆర్ తెలిపారు.

ఎన్నికల హామీల లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటం చేతకాకనే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని సృష్టించారని ఈ ఘటన ద్వారా రాష్ట్ర ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ మండి పడ్డారు.ప్రజా సమస్యలపై నుంచి అటెన్షన్-డైవర్షన్‌లో భాగంగానే సినిమా వాళ్ళ పైన రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. అప్పుల బాధలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు నేతన్నలు చనిపోయారు గురుకుల విద్యార్థులలో పిల్లలు కూడా చనిపోయారు.ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వీరందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలిపారు.

ఇలా రైతులు ఆటో డ్రైవర్లు నేతన్నలు గురుకుల విద్యార్థులు చనిపోయిన వాళ్ళ అసలు మనుషులే కాదన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలిపారు. సినిమా వాళ్ళతో భేటీ అయి వారితో సెటిల్మెంట్స్ చేసుకొని ప్రస్తుతం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి కనక ఉంటే ఇప్పటివరకు చనిపోయిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించాలి అప్పటివరకు పోరాటం చేస్తూ ఉంటామని తెలిపారు. ఇక హైడ్రా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగమే అంటూ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మండిపడ్డారు.