కేటీయార్.? కవిత.? ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి.?

కేటీయార్ వర్సెస్ కవిత.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి విషయమై భారత్ రాష్ట్ర సమితిలో గ్రూపుల పంచాయితీ పెరిగిపోతోందిట.! ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నట్టు.. కేసీయార్ అయితే ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి వదిలేలా లేరుగానీ, ‘వారసత్వం’ ఎవరిది.?  అన్నదానిపై పంచాయితీ మాత్రం నడుస్తోంది.

కేటీయార్ ఉన్నత విద్యావంతుడు. కవిత సంగతి సరే సరి.! ఇద్దరూ ఉద్యమ నేపథ్యం నుంచే వచ్చారు.. కేసీయార్ వారసత్వం మాత్రమే కాకుండా.! తెలంగాణ ఉద్యమంలో కేటీయార్ ఎంత దూకుడుగా వ్యవహరించారో, అంతకు మించి ఉద్యమ నాయకురాలిగా సత్తా చాటారు కవిత.

మరి, కేసీయార్ మేనల్లుడు హరీష్ రావు సంగతేంటి.? ఔను కదా.? కవిత అలాగే కేటీయార్ కంటే కూడా హరీష్ రావు ఇంకా ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో తనదైన ప్రత్యకతను చాటుకున్నారు. ఆ లెక్కన, వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే, హరీష్ రావుకే ఇవ్వాలి.. కేసీయార్ తర్వాత.

కానీ, హరీష్ రావుని ఈ విషయంలో సైడేసెయ్యడం కేటీయార్, కవితలకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. అప్పుడు మాత్రమే, తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కేసీయార్ నుంచి కేటీయార్ లేదా కవిత లేదా హరీష్ రావు.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి దక్కొచ్చు.

ఇవేవీ కాదు, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారి, బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో అధికారంలోకి వస్తే.?