KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం అలాగే ప్రతిపక్షాల మధ్య నిత్యం ఏదో ఒక విషయం గురించి పెద్ద ఎత్తున వాదోపవాదములు చర్చలు జరుగుతున్నాయి. ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తరచూ అధికార ప్రభుత్వంపై అలాగే అధికారులపై కూడా మండిపడుతూ సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులు కూడా ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈయన తెలిపారు.
ఈ క్రమంలోనే అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల కలెక్టర్ కు ఈయన వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకువచ్చి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరేం చేసిన బిఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు అధికారులు పోలీసులు ఎన్ని డ్రామాలు చేస్తారో చేయండి. కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్న ప్రతి ఒక్క అధికారికి నేను ఈరోజు చెబుతున్న రాసి పెట్టుకోండి. నేనేమీ మీరు అనుకున్నంత మంచి వాడిని కాదు ఈరోజు ఎవరైతే అతి చేస్తున్నారో వారికి రేపు మేము వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాము అంటూ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఈయన సిరిసిల్ల కలెక్టర్ ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కలెక్టర్ స్పందన అలాగే ముఖ్యమంత్రి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.