KTR: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే అయితే ఈ సమస్త కు పెద్ద ఎత్తున డబ్బులను పంపించినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేయడమే కాకుండా ఈ విషయంపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ విషయంలో కేటీఆర్ పై కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ఏ 1 ముద్దాయిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎ2 ముద్దాయిగా కేసు నమోదు అయింది.
తాజాగా ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఫార్ములా -ఈ రేస్ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థకు డబ్బులు చెల్లించాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నేనే చెప్పాను అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ముందుగా చెప్పిన మాటకే తాను కూడా కట్టుబడి ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇలా ఆ సమస్తకు డబ్బు పంపించమని చెప్పింది నేనే అయితే ప్రాసెస్ ప్రకారం పని చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని, ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నానని తెలిపారు. అందువల్ల తాను మాట మార్చినట్టు కాదని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై తన పట్ల కేసు నమోదు చేయడంతో ప్రభుత్వ తీరుపై కూడా కేటీఆర్ మండిపడ్డారు పసలేని పనికిమాలిన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
అధికారం వారి చేతుల్లో ఉంది కదా అని అవినీతి జరిగినటువంటి వాటిపై కూడా ఏసీబీ కేసులు పెట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాము భయపడమని ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు అంటూ కేటీఆర్ తెలిపారు అలాగే ఇదే విషయంపై అవినీతి జరగలేదు అంటూ స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. మరి అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే చెప్పలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు.