KTR: ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ హైడ్రామా… అందుకే వెనుతిరిగానంటూ కామెంట్స్!

KTR: మాజీ మంత్రి ప్రస్తుతం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల ఏసిబి అధికారులు ఫార్ములా-ఈ కారు రేసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా ఈయన నేడు విచారణకు హాజరయ్యారు అయితే విచారణకు వెళ్లినటువంటి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చేశారు అనంతరం విచారణకు హాజరు కాకుండా ఆయన వెను తిరిగి వెళ్లిపోయారు.

ఈ విధంగా విచారణకు వచ్చిన కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోవడానికి గల కారణం తన లాయర్ ని కూడా ఈ విచారణకు అనుమతించకపోవడమే కారణమని తెలుస్తుంది. ఇలా ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనక్కి వెళ్లే ముందు ఏసీబీ ఏఎస్పీ అధికారి ఖాన్‌కు లిఖితపూర్వకంగా లేఖను అందజేశారు. మీకు కావాల్సిన సమాచారం నేను అందజేస్తానని ఆ లెటర్ లో రాసి ఉంది. ఇలా ఈ కార్యాలయం నుంచి వెనుతిరిగిన ఈయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. తాను విచారణకు రాకుండా వెనక్కి రావడానికి గల కారణం ఏంటనే విషయంపై ఆయన మాట్లాడారు.

ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని.. దీని వల్ల సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏమీ లేదని కేటీఆర్ తెలిపారు. ఈరోజు తన మామ రెండవ సంవత్సరీకం.నన్ను ఇక్కడ విచారణకు కూర్చోబెట్టి నా ఇంట్లో దాడులు చేసేందుకు ప్రణాళికలు చేశారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణకు రావాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా నేను ఈ విచారణకు హాజరు అయ్యానని తెలిపారు.
కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ తప్పించుకోను ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నిజాయితీగా ఉన్నాను అందుకే భయపడటం లేదని తెలిపారు.

ఇక నేను నా లాయర్ తో పాటు కలిసి విచారణకు వస్తే మీరెందుకు భయపడుతున్నారు అంటూ అధికారులను ప్రశ్నించారు. నా లాయర్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు నాకు రేవంత్ రెడ్డి పై నమ్మకం లేదని అందుకే తాను నా లాయర్ తో పాటే విచారణకు హాజరవుతానని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.