KTR: కేటీఆర్ నేను చాలా క్లోజ్… సంచలన వ్యాఖ్యలు చేసిన దివ్వెల మాధురి!

KTR:దివ్వెల మాధురి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇటీవల కాలంలో ఈమె వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి సహజీవనం చేస్తున్నారన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా మాధురి సోషల్ మీడియా మీడియా వార్తలలో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్ తన భర్త వాణితో విభేదాలు రావడంతో ఈమె దగ్గరయ్యారని తెలుస్తోంది. అయితే మాధురి కారణంగా తన భర్త మాకు దూరమవుతున్నారు అంటూ దువ్వాడ భార్య వాణి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఇలా ఈ వ్యవహారం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక వీరి రిలేషన్ గురించి అన్ని విషయాలు బయటపడటంతో దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇద్దరు కూడా బహిరంగంగా చట్టాపట్టాలేసుకొని తిరగడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని మాకు పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు కూడా పెడతాము అంటూ మీడియా సమావేశాలలో వెల్లడించారు.

ఇక ఇటీవల వీరిద్దరి పుట్టినరోజులు కూడా జరిగాయి అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా వీరు ఒకరి కోసం మరొకరు పెద్ద ఎత్తున పార్టీలు ఏర్పాటు చేసుకోవడం ఖరీదైన కానుకలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరిగింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాధురి మాట్లాడుతూ కేటీఆర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు కేటీఆర్ చాలా బాగా తెలుసు అని మేమిద్దరం క్లోజ్ అంటూ ఈమె తెలియజేశారు.

తాను చాలా సార్లు కేటీఆర్ ను కలిసానని మీడియా చిట్ చాట్లో చెప్పుకొచ్చింది. ఈ మేరకు కేటీఆర్ ను కొనియాడింది. తాను బెల్లంకొండ సురేష్ ద్వారా కేటీఆర్ ను పార్క్ హయత్ హోటల్లో రెండు మూడు సార్లు కలిసానని పేర్కొంది. కేటీఆర్ కి పెద్ద పొలిటిషన్ అనే గర్వం ఉండదని చాలా సరదాగా ఉంటారని కేటీఆర్ గురించి తెలిపారు. రాజకీయాలలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఎంతో ఓపికగా పనిచేయాలి అనే విషయాలను కేటీఆర్ తెలియచేస్తారు ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కేటీఆర్ పొలిటికల్ లైఫ్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారని వెల్లడించారు.