తాను టిఆర్ఎస్ లో చేరతానని, బిజెపిలో చేరతానని వస్తున్న ప్రచారాలను కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. తన ఎమ్మెల్యే సభ్యత్వం విషయంలో కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.
తాను టిఆర్ఎస్ లో చేరతానంటూ ఢిల్లీలో కేసిఆర్ కామెంట్ చేసినట్లు వస్తున్న మాటల్లో నిజం లేదన్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనకు అనుమతించకపోవడం కుట్ర అని కోమటిరెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి మరిన్ని అంశాలపై మాట్లాడిన వీడియోలు 2 కింద ఉన్నాయి చూడండి.