బ్రేకింగ్ న్యూస్ : కోమటిరెడ్డికి మరో షాక్

కోమటిరెడ్డికి దెబ్బ మీద

కోమటిరెడ్డి వివరణతో సంతృప్తి చెందని కమిటీ

మరింత స్పష్టమైన వివరణ కావాలని ఇంకో నోటీసు

24 గంటల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశం

కాంగ్రెస్ లో కలవరం

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ఇటీవల కాలంలో తెలంగాణ ఎఐసిసి ఇన్చార్జి రామచంద్ర కుంతియా మీద గరం గరం కామెంట్స్ చేశారు. అంతేకాకుండా బ్రోకర్ నా కొడుకులకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీల్లో పదవులు ఇచ్చారని మండిపడ్డారు. అంతేకాకుండా వివరణ ఇచ్చే సమయంలో పదవులు అమ్ముకునేవారు నాకు నోటీసులు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోాపల్ రెడ్డి అటు కుంతియా మీద, ఇటు పిసిసి నాయకత్వం మీద చేసిన ఘాటైన లేఖలపై పిసిసి క్రమశిక్షణా సంఘం తాఖీదు ఇచ్చింది. దానికి సీల్డ్ కవర్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం రిప్లై ఇచ్చారు. ఆయన వివరణ పై గాంధీభవన్ లో సోమవారం కోదండరెడ్డి నాయకత్వంలో క్రమశిక్షణ సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై చర్చించారు. ఆయన ఇచ్చిన వివరణ పైనా చర్చ జరిగింది.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణతో వారు సంతృప్తి చెందలేదని తెలిసింది. దీంతో మరింత స్పష్టమైన వివరణ కోరుతూ మరో నోటీసును కోమటిరెడ్డికి పంపిణీ చేశారు క్రమశిక్షణ సంఘం నేతలు. ఆ నోటీసుకు 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోమటిరెడ్డిని ఆదేశించారు. దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ ఇచ్చే సమాధానం బట్టి ఆయన మీద చర్యలు ఉంటాయా లేదా అన్నది తేలుతుంది.

గాంధీభవన్ లో సోమవారం మధ్యాహ్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఛైర్మన్ కోదండరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘన అంశాలపై సుదీర్ఘంగా, లోతుగా చర్చించింది కమిటీ. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి మరో షో కాజ్ నోటీస్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నోటీసుకు  24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. 

అయితే సీల్డు కవర్ లో రాజగోపాల్ రెడ్డి మూడు పేజీల వివరణ లేఖ అందించారు. రాజగోపాల్ రెడ్డి మూడు పేజీలు వివరణ ఇచ్చినప్పటికీ క్రమశిక్షణ అంశాలపై సమాధానం ఇవ్వలేదని కమిటీ భావించింది. గతంలో ఇచ్చిన నోటీస్ కు 48 గంటలలో రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన నోటీస్ కు సంతృప్తి చెందని కారణంగానే మరో తాఖీదు పంపింది. 

ఇప్పటి నుంచి 24 గంటల లోపు తిరిగి సమాధానం ఇవ్వాలని నోటీస్ లో పేర్కన్నది కమిటీ. రాజగోపాల్ రెడి మునుగోడు లో మాట్లాడిన మాటలకు, నోటీస్ ఇచ్చిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది కమిటీ. వాటిని ఉటంకిస్తూ స్పష్టమైన జవాబు ఇవ్వాలని కమిటీ నోటీస్ జారీ చేసింది.

టిపిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కమిటీ కన్వీనర్ ఆనంతుల శ్యామ్ మోహన్, సభ్యులు నంది ఎల్లయ్య, కమలాకర్, సంభాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండో నోటీసుకు కూడా కోమటిరెడ్డి బదులిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ రెండో నోటీసుకు బదులు ఇచ్చినా స్పష్టమైన వివరణ రాకపోతే కమిటీ ఏరకమైన సిఫార్సు చేస్తుందన్నది కూడా తేలాల్సి ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన కరుకు కామెంట్స్ ఇవి

తెలంగాణకు శనిలా దాపురించిండు కుంతియా

కుంతియాకు నేను భయపడాల్నా?

వంద మంది కుంతియాలు వచ్చినా నన్నేమీ చేయలేరు.

బ్రోకర్ నా కొడుకులకు ఎన్నికల కమిటీల్లో చోటు కల్పించారు.

గాంధీభవన్ లో టివిల ముందు, పేపర్ల ముందు మాట్లాడే వారికి పదవులు ఇస్తారా?

పదవులు అమ్ముకునే వాళ్లు నాకు నోటీసులు జారీ చేస్తారా?

ఈ రకమైన హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి. వాటికి స్పష్టమైన వివరణ రాలేదని కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే మరో నోటీసు జారీ చేసింది. కమిటీ జారీ చేసిన రెండో నోటీసు కింద ఉంది చూడొచ్చు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జారీ చేసిన రెండో నోటీసు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని కోరిన టిపిసిసి క్రమశిక్షణ సంఘం