స్వామీజీలు ప్రభుత్వాన్ని కూల్చుతారా.. కిషన్ రెడ్డి ప్రశ్నపై కేసీఆర్ ఏమంటారో?

తెరాస ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని ప్రజల్ని నమ్మించడానికి కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. అయితే కేసీఆర్ మాట్లాడుతున్నా ఆ ఎమ్మెల్యేలు మాత్రం మీడియాలో మాట్లాడకపోవడం గమనార్హం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు తెరాస వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. ప్రభుత్వం కూలిపోయేంత బలహీన స్థితిలో తెరాస ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ కథ కేసీఆర్ ఊహాజనితమైన ఆలోచనల నుంచి పుట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నీతిమంతుడని కేసీఆర్ చెబుతున్నారని స్వామీజీలు ఎక్కడైనా ప్రభుత్వాన్ని కూల్చుతారా అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. మీ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారో చెప్పాలని ఆయన కామెంట్లు చేశారు. మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వళ్లిస్తారా అని ఆయన చెప్పుకొచ్చారు.

సీఎం పదవిని చులకన చేస్తూ కేసీఆర్ మాట్లాడారని ఆయన కామెంట్లు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ సీఎం కావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేసీఆర్ ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. బయటి వ్యక్తులతో బేరసారాలు జరపాల్సిన కర్మ మాకేంటని ఆయన వెల్లడించడం గమనార్హం.

సీబీఐని అడ్డుకోవాలనే ఆలోచనతో పాత తేదీలతో జీవోలు ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ కూడా తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేస్తున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు కూడా కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు నిజమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.