జగన్ దే అధికారం..ఇది ఫిక్స్..ప్రమాణ స్వీకారానికి కెసియార్

ఈనెల 23వ తేదీన వెలువడనున్న ఫలితాల్లో వైసిపిదే అధికారం ఖాయమట. అంటే ఈ విషయాన్ని ఇప్పటికే బోలెడు సర్వే సంస్ధలు చెప్పినా తాజాగా చెప్పింది మాత్రం కెసియార్.  ఆదివారం ప్రగతి భవన్లో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో కెసియార్ భేటీ జరిగింది. ఆ సందర్భంగా ఏపి రాజకీయాలపైన కూడా చర్చ జరిగింది. కెసియార్ మాట్లాడుతూ 23వ తేదీ ఫలితాల్లో వైసిపి అధికారంలోకి రావటం ఖాయమని చెప్పారు.

23వ తేదీ తర్వాత జరిగే ప్రమాణ స్వీకారానికి తనతో పాటు తన కూతురు కవిత కూడా హాజరవుతుందని కూడా కెసియార్ చెప్పారట. అంత నమ్మకంగా ఎలా చెప్పగలరని కొందరు సీనియర్లు ఆడిగారు. ఏపిలో పోలింగ్ తర్వాత సర్వేలు చేయించుకున్నట్లు కెసియార్ వెల్లడించారట.

ఇప్పటి వరకూ ఏ ఎన్నికలో కూడా తాను చేయించుకున్న సర్వే తప్పవ్వలేదని కూడా కెసియార్ స్పష్టం చేశారని సమాచారం.  పోలింగ్ సరళితో పాటు అనేక అంశాలను భేరీజు వేసుకున్న తర్వాతే జగన్ గెలుస్తాడని తాను అంచనాకు వచ్చినట్లు చెప్పారు. కెసియార్ మాటలు విన్న తర్వాత జగన్ దే గెలుపు అని అనుకుంటున్నారు. బహుశా చంద్రబాబుకు కెసియార్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైనపుడు ఇస్తారేమో ?