తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ఫలితాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక కోసం అన్ని విధాలుగా కష్టపడినా ఆశించిన ఫలితాలు అయితే రాలేదని కేసీఆర్ భావిస్తున్నారని బోగట్టా. మునుగోడులో భారీ మెజార్టీ వస్తే బీ.ఆర్.ఎస్ పార్టీ పేరు దేశవ్యాప్తంగా వినిపించవచ్చని కేసీఆర్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
బీ.ఆర్.ఎస్ విషయంలో కొన్నిరోజుల పాటు యాక్టివ్ గా ఉన్న కేసీఆర్ మళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకపోవడం కేసీఆర్ ను ఎంతగానో బాధ పెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్టుల వల్లే ఎన్నికల్లో పార్టీ గెలిచిందని కేసీసార్ భావిస్తున్నారు.
మునుగోడు ఫలితాలు కేసీఆర్ ను ఒకింత టెన్షన్ పెట్టాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక వల్ల ఓటర్లు మాత్రం భారీ స్థాయిలో లబ్ధి పొందారని మరి కొందరు చెబుతున్నారు.
మునుగోడు ఫలితాలు అన్ని పార్టీలకు వేర్వేరు షాకులిచ్చాయి. తెలంగాణలో అన్ని పార్టీలు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. మరోవైపు కేసీఆర్ సైలెన్స్ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. కేసీఆర్ ప్రజల్లోకి రావాలని కొంతమంది కోరుకుంటుండగా కేసీఆర్ ఏం చేయనున్నారో చూడాలి.