కేసీఅర్ కాపు పాలిటిక్స్… ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, ఫలితంగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆరెస్స్ అధినేత కేసీఆర్ తెగ తాపత్రయ పడుతున్నారు. పైగా పెట్టుకున్న కొత్త లక్ష్యం… జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పడం సాధ్యమవ్వాలంటే… తెలంగాణలో గెలవడం అత్యంత ప్రధానం. రచ్చ గెలవాలనుకునే ముందు ఇంట గెలవడం అతి ముఖ్యం. ఈ సమయంలో కాపులపై కాన్సంట్రేషన్ పెట్టారు కేసీఆర్.

అవును… కేసీఆర్ కాపు రాజకీయం మీద చర్చ మొదలైపోయింది. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు పట్టించుకోవడంలో కేసీఆర్ చిన్నచూపు చూశారని తెలంగాణలో కాపులు హర్ట్ అయ్యి ఉన్నారు. దీంతో ఈ విషయం గ్రహించిన కేసీఆర్… వారిని బుజ్జగించే పనికి పూనుకున్నారు.

ఇందులో భాగంగా… హైదరాబాద్ లో మున్నూరు కాపు ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు! అయితే… ఈ భేటీలో మెజారిటీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే బీఆరెస్స్ కి తమ మద్దతు అని చెప్పినట్లు సమాచారం.

దీంతో.. కేసీఆర్ అందుకు సరేనంటూ.. మరొక హామీ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. కాపుల కు భవనం కోసం అయిదు ఎకరాల స్థలం అలాగే వారికి రూ.10 కోట్ల రూపాయల నిధులను కూడా ఇచ్చేందుకు అంగీకరించారని టాక్.

అదంతా ఒకెత్తు అయితే… ఏపీలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేస్తే అందుకు అవసరమైన ఆర్థిక వనరులు తాను సమకూరుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని వల్ల పవన్ కళ్యాణ్ కి ఏపీలో రాజకీయ లాభం కలిగితే.. తెలంగాణాలో బీఆరెస్స్ కి కూడా అది లాభిస్తుందని భావిస్తున్నారంట.

ఇదే జరిగితే… చంద్రబాబు మూడోస్థానానికి పరిమితం అయిపోతారని కేసీఆర్ స్కెచ్ అని అంటున్నారు. ఫలితంగా… ఇటు బీఆరెస్స్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్, అటు చంద్రబాబు పొలిటికల్ కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజయ్యే అవకాశం… ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని భావిస్తున్నారని తెలుస్తుంది.

మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఏపీలో వారాహి యాత్ర సాగుతున్న వేళ… కేసీఆర్ వేసిన ఈ కాపు స్కెచ్ ఏమేరకు సక్సెస్ అవుతోంది.. పవన్ ను ఏమేరకు ఒప్పించగలుగుతుంది అనేది వేచి చూడాలి!