మరో ఇద్దరు టిఆర్ ఎస్ సిటింగ్ లకు కెసిఆర్ షాక్

మరొక ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.  మేడ్చల్,  మల్కాజ్ గిరి తాజామాజీలకు ఆయన గుడ్ బై చెప్పారు. దీనితో టిఆర్ ఎస్ సిటింగ్ లలో వేటు పడిన వారి సంఖ్య నాలుగు కు చేరింది. ఆ మధ్య ఆయన 105 మంది టిఆర్ ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలచేసిన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు తప్ప సిటింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లిచ్చారు.  ‘

స్ బిస్సయిన ఇద్దరుసభ్యులు  సినిమాయాక్టర్ బాబూ మోహన్(ఆందోల్),నల్లా ఓదెలు (చెన్నూర్). ఈ జాబితాలోకి ఇపుడు   ఎం సుధీర్ రెడ్డి ( మేడ్చల్ ), సి కనకారెడ్డి (మల్కాజ్ గిరి) తాజా మాజీలు కూడా చేరారు.

నిజానికి  ముఖ్యమంత్రి 105 పేర్లు ప్రకటించినా పద్నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించలేదు. అందులో ఈ రెండు నియోజకవర్గాల పేర్లున్నాయి. అయితే, సిటింగ్ లందిరికి  టికెట్ ఇస్తానని చెప్పారు కాబట్టి సుధీర్ రెడ్డి, కనకరారెడ్డిలకు కూడ టికెట్ ఉంటుందని అనుకున్నారు. ఇపుడు ఈ రెండు నియోజవర్గాలకు ఆయన వేరే  పేర్లను ప్రకటించబోతున్నారు. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం,  మేడ్చెల్ అసెంబ్లీ స్థానానికి మల్కాజ్ గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి పేరు ఖరారయింది. అదే విధంగా మాజీ టిడిపి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ను మల్కాజ గిరి నుంచి పోటీ పెట్టించేందుకు కెసియార్ నిర్ణయించినట్లు తెలిసింది.  మల్లారెడ్డి కి చెందిన ఆస్తులు- ఇంజనీరింగ్ కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు, రియల్ఎస్టేట్ బిజినెస్ మేడ్చెల్ ఏరియాలో కేంద్రీకృతమై ఉంది. అందువల్ల ఆయన మేడ్చెల్ నుంచి పోటీ చేసి వ్యాపారం వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు. మెడ్చెల్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని  ఆయన ముఖ్యమంత్రి మీద వత్తిడితెస్తున్నారు. అన్నింటికి మించి మల్లారెడ్డి దగ్గిర ఏ ఎన్నికల్లో నయినా తలపడేంత ధనబలం ఉన్నవాడు.

సిహెచ్ మల్లారెడ్డి

ఇక మైనం పల్లి కూడా మల్లారెడ్డికి తక్కువేం కాదు. ఆయనగతంలో రెండుసార్లు , ఒకసారి రామాయంపేట్, మరొక సారి మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు.  రెడ్డి రావు, ఇద్దరు టిడిపి నుంచి టిఆర్ ఎస్ లో చేరిన వారు.

మైనంపల్లి

 

ఇద్దరు  టిడిపి వదిలేసి టిఆర్ ఎస్ చేరారు.  ఇద్దరు మల్కాజ్ గిరి ఎంపి సీటులకు తలపడ్డారు. అపుడు టిడిపి అభ్యర్థిగా రెడ్డి పోటీ చేస్తే, మైనంపల్లి టిఆర్ ఎస్ అభ్యర్థి. రెడ్డి చేతిలో మైనంపల్లి వోడిపోయాడు. ఇద్దరి సత్తా ఏమిటో తెలుసు కాబట్టి  నియోకవర్గాలలో ప్రచారం మొదలుపెట్టాలని ఇద్దరికి కెసియార్ సూచించినట్ల సమాచారం.

 

ఇది కూడా చదవండి

అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే…