కేసీయార్ కుమార్తె కవిత వ్యవహారం.! మీడియా మాఫియా.?

ఏదో కొంపలు మునిగిపోయినట్లు.. మీడియా అంతా కల్వకుంట్ల కవిత చుట్టూ తిరిగింది. ఆమె హైద్రాబాద్ నుంచి బయల్దేరడం.. ఢిల్లీలో ల్యాండ్ అవడం.. మినిట్ టు మినిట్ కవర్ చేసింది మెజార్టీ తెలుగు మీడియా. ఇంతకీ, ఆమె దేశాన్ని ఉద్ధరించే గొప్ప పని ఏమైనా చేశారా.? అంటే, లేదు.. ఈడీ నుంచి శ్రీముఖం అందుకున్నారు.

ఢిల్ల లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను ఈడీ విచారించనుంది. విచారణ నిమిత్తం ఆమె ఢిల్లీకి వెళ్ళారు. అదీ అసలు సంగతి. మహిళా రిజర్వేషన్ల విషయమై ఢిల్లీ వేదికగా ఆమె ధర్నా కూడా చేయనున్నారు. నిజానికి, ఆమె ధర్నా చేయాల్సింది తెలంగాణలో. ఔను, తెలంగాణలో మహిళా ప్రజా ప్రతినిథులకు కేసీయార్ మంత్రి వర్గంలో ఎంత ప్రాతినిధ్యం దక్కింది.? అన్నది ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి.

రాజకీయం అంటేనే ఇంత.! సరే, మహిళా రిజర్వేషన్ వ్యవహారాన్ని పక్కన పెడదాం. మీడియా ఎందుకు ఇంతలా అన్ని పనులూ మానేసుకుని, కవిత వెంట పడినట్లు.? ఇదంతా పెయిడ్ మీడియా మాఫియా.. అంటూ మీడియా వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈడీ విచారణ అంటే ఏమవుతుంది.? మహా అయితే అరెస్టు చేస్తారంటూ కవిత స్వయంగా లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా, రాజకీయ నాయకులు కేసులకు భయపడతారా.? అవి వాళ్ళకి అదనపు ‘హోదా’ కలిగిస్తాయి రాజకీయంగా.

కేసులే రాజకీయ నాయకుల ఇమేజ్‌ని పెంచుతాయ్.అరెస్టయి, జైలుకెళితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వస్తుంది.. అలాంటి రాజకీయ నాయకుల్ని చాలామందినే చూశాం.