కేరళ వరద బాధితుల కోసం విరాళాలు ఇచ్చేవారి సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్య తన రెండు నెలల వేతనాన్ని కేరళ బాధితులకు అందజేశారు.
ఆమె తన కుటుంబంతో సహా వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి చెక్కు ను అందజేశారు. 1 లక్షా 20వేల రూపాయల చెక్కును అందించారు. కేరళ సిఎం సహాయ నిధికి ఈ సొమ్ము అందేలా చెక్కు ఇష్యూ చేశారు. కావ్య భర్త డాక్టర్ నజీర్, కూతురు దియ కలెక్టర్ ను కలిశారు.
దియ చేతుల మీదుగా కలెక్టర్ కు చెక్ ఇచ్చారు. కేరళ వరదలు తనను కలిచివేశాయని డాక్టర్ కావ్య తెలిపారు. అందుకే రెండు నెలల వేతనాన్ని విరాళం గా ఇచ్చినట్లు వెల్లడించారు.