బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత తెలంగాణాల కొత్త రాజకీయం మొదలైంది. ఈ రాజకీయాలకు నాంది పలికింది మాత్రం బండి సంజయ్. అయితే ఇప్పుడు తెలంగాణలో మరింత బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఇప్పుడు వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై కన్ను వేసింది. ఇక్కడ కూడా విజయం సాధిస్తే తెలంగాణాలో తమను ఆపే శక్తే లేదని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి సంజయ్ ఇద్దరు నాయకులకు గాలం వెయ్యడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరా ఇద్దరు నాయకులు!!
టీఆర్ఎస్ లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయకులను అక్కున చేర్చుకోవడానికిబీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకే కడియం శ్రీహరిని పార్టీలోకి చాలా రోజుల నుండి ఆహ్వానిస్తోంది. కడియం శ్రీహరికి వరంగల్ మొత్తం మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను తమ సొంతం చేసుకోవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు అయిన కొండా సురేఖను కూడా పార్టీలోకి తీసుకోవడానికి బీజేపీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆమె మాత్రం బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇద్దరు నాయకులు ఒకవేళ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయం వరకు బీజేపీలోకి వస్తే మాత్రం మళ్ళీ అక్కడ కూడా బీజేపీ హవా నడుస్తుంది.
సీఎం కుర్చీకి బండిదేనా!!
సీఎం కుర్చీపై బండి సంజయ్ కన్ను వేశారు. ఇప్పుడు ఒకవేళ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయానికి కడియం శ్రీహరి, కొండా సురేఖ లాంటి నాయకులు బీజేపీలోకి వస్తే రానున్న రోజుల్లో బీజేపీని ఆపడం ఎవ్వరి తరం కాదు.ఇలా నేతలందరిని పార్టీలోకి తీసుకొని సీఎం కుర్చీపై కూర్చోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకొని నాయకులను కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో బీజేపీ చేతిలో చిత్తుగా ఒడిపోవాల్సిందే.