కడియంతో తెరాస మార్క్ రాజకీయం ఫలించేనా..?

kcr kadiyam srihari telugu rajyam

 తెలంగాణలో ఎన్నికల హడావిడి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అన్ని పార్టీలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా మరో నాలుగు నెలల్లో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటి నుండే సన్నాహాలు చేసుకుంటున్నారు. అధికార తెరాస పార్టీ ఇందుకోసం ముందస్తు సన్నాహాలు గట్టిగానే చేస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

kadiayam srihari

 

 ఈ ఎన్నికలు తెరాసకు అంతకు అనుకూలంగా అనిపించటం లేదు. తెలంగాణలో పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికెషన్ పడిన దాఖలాలు లేవు. పైగా కరోనా వలన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నారు, దాని ప్రభావం కచ్చితంగా అధికార పార్టీ మీద పడే అవకాశం ఉంది. దీనితో తెరాస ఈ ఎన్నికల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలి. దానికి తోడు బలమైన అభ్యర్థిని బరిలో దించితే తప్ప విజయం సాధ్యం కాకపోవచ్చు. ఈ స్థానం యొక్క బాధ్యతలు చూస్తున్న కేటీఆర్ ఇవన్నీ అలోచించి సీనియర్ నేత కడియం శ్రీహరిని రంగంలోకి దించాలని చూస్తున్నాడు. దళిత నేతైనా కడియం శ్రీహరి గతంలో విద్య శాఖ మంత్రిగా పని చేశాడు. కాబట్టి ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగివున్నాడు.

  టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత కడియం. ఆ తర్వాత తెరాస పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో వరంగల్ నుండి ఎంపీ గా పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. వరంగల్ లో మంచి పట్టున్న నేత, అదే విధంగా నల్గొండ, ఖమ్మం లో కూడా కడియం శ్రీహరి కి మంచి పేరుంది. ముఖ్యంగా ఎలాంటి వివాదాలు లేని నేతగా ఆయన్ని అందరు గౌరవిస్తారు. అవతలి పార్టీలు ఎలాంటి నేతను రంగంలోకి దించిన కానీ కడియం వాళ్ళని ఓడిస్తాడనే నమ్మకం తెరాస అధినాయకత్వంలో వుంది. అందుకే ఆయన్ని ఫైనల్ చేయాలనీ చూస్తున్నారు. అయితే కడియం శ్రీహరి తాను ఎమ్మెల్సీ గా పోటీ చేయాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు కావ్య కి టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది.

  నిజానికి గత ఎన్నికల్లోనే తన కూతురికి టిక్కెట్ కోసం కడియ గట్టిగానే ప్రయత్నాలు చేశాడు, కాకపోతే సీఎం కెసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కు టిక్కెట్ ఇవ్వటంతో అప్పుడు సాధ్యపడలేదు. ఇక కడియం చేసిన ప్రతిపాదన పట్ల తెరాస నాయకత్వం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో కడియం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి కడియం ఈ ఎన్నికల్లో విజయం సాధించి తెరాస నమ్మకాన్ని నిలబెట్టటమే కాకుండా వచ్చే ఎన్నికల నాటికీ తన కూతురికి రాజకీయ భవిష్యత్తు ఇస్తాడో లేడో చూడాలి..