నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. అసత్య ప్రచారాలు చెయ్యొద్దంటున్న మోహన్ బాబు!

జల్ పల్లి లో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అయితే ఆయన ఎక్కడా కనిపించడం లేదని, పరారీలో ఉన్నారని, పోలీసులు బృందాలుగా ఏర్పడి మోహన్ బాబుని వెతుకుతున్నారని ఇంటా బయట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

తనపై నమోదైన హత్యాయత్నం కేసు విషయంలో తనకి ముందస్తు బెయిల్ కావాలని మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తన అభ్యర్థనని హైకోర్టు తిరస్కరించిందని అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ మోహన్ బాబు ఎక్కడికి పారిపోలేదని రెండు రోజుల్లో వచ్చి వెపన్ సబ్మిట్ చేస్తానని తమకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పారు.

ఇదే క్రమంలో మోహన్ బాబు కూడా ఈ వార్త కి స్పందిస్తూ తాను ఎక్కడికి పారిపోలేదని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. తన బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించిందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టి వేయలేదని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ట్విట్ చేశారు. అలాగే మోహన్ బాబు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని కోరుకున్న తర్వాత పోలీస్ విచారణకు హాజరవుతానని పోలీసులని కోరినట్లు సమాచారం.

అయితే పోలీసులు మాత్రం సత్వరమే పోలీసు విచారణకు హాజరు కావాలని, గన్ కూడా సరెండర్ చేయమని మోహన్ బాబుని అడిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు గన్ సరెండర్ చేస్తానని మోహన్ బాబు చెప్పారని వార్త ఒకటి చెక్కర్లు కొడుతుంది మరి అందులో ఎంత వరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరొకవైపు మనోజ్ విలేకరులతో మాట్లాడుతూ మీడియా తన ఇంటిపై దాడి చేసింది అని తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ కి వ్యతిరేకంగా మీడియా తప్పులేదు నేనే వాళ్ళని తీసుకొచ్చాను అంటూ తండ్రికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరో బాంబు పేల్చాడు. దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.