మీడియా తప్పులేదు.. తండ్రికి వ్యతిరేకంగా మరో బాంబు పేల్చిన మనోజ్!

మోహన్ బాబు ఇంట్లో జరిగిన అల్లర్ల కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. టీవీ9 మీడియా ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కొని విచక్షణారహితంగా అతనిపై దాడి చేశారు. దీంతో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో మోహన్ బాబు రౌడీయిజం చూపించాడని బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ జర్నలిస్టు సంఘాలు, ధర్నాకు దిగాయి.

ముందు నా తప్పులేదు నేను క్షమాపణ చెప్పను అన్న మోహన్ బాబు తర్వాత ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్తూనే ఆ దాడి కావాలని చేసింది కాదు క్షణికావేశంలో జరిగిపోయింది, దాదాపు 30 నుంచి 50 మంది ప్రైవేటు వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు నా ఇంటి గేటుని తోసుకొని లోపలికి చొరబడ్డారు. మాకు హాని చేసేందుకు ఇంట్లోకి జొరబడ్డారు దీంతో నేను నా సహనం కోల్పోయాను.

ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులను గమనించకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఈ విషయం లో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 645/2024 నమోదు చేశారు భారత న్యాయ సంహిత లోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ చేశారు దీన్ని హత్యాయత్నం కేసుగా బదిలాయించారు. అలాగే భారత న్యాయ సంహిత సెక్షన్ 108 అటెంప్ట్ మర్డర్ కింద ఈ దాడి కేసిన బదలాయించినట్లు సమాచారం.

అయితే మీడియా దాడి విషయంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తండ్రికి వ్యతిరేకంగా మరొక బాంబు పేల్చాడు. శనివారం మీడియాతో మాట్లాడిన మనోజ్ జర్నలిస్టుపై దాడి ఘటనలో మీడియా తప్పేమీ లేదని, తానే వారిని లోపలికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశాడు మనోజ్. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అందుకే జర్నలిస్టులని లోపలికి తీసుకొని వెళ్లాను మా ఇంట్లోకి నన్ను రానివ్వకపోవడంతో నేనే మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని వెళ్లాను అని చెప్పాడు మనోజ్.