డబ్బులిచ్చి మరీ లీక్ చేయిస్తున్నారట.!

ఓ స్టార్ హీరో.. ఓ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా గురించి ఓ గాసిప్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ షెడ్యూల్స్ నడుస్తున్నాయ్.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. టైటిల్ విషయమై రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్. ఆ గాసిప్స్ కావాలనే చిత్ర యూనిట్ క్రియేట్ చేస్తోందనీ ముఖ్యంగా సినిమా నిర్మాతే డబ్బులిచ్చి మరీ లీక్ చేయిస్తున్నాడనీ మాట్లాడుకుంటున్నారు ఓ యువ నిర్మాత ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. కాగా ఓ సినీ జర్నలిస్టుకి డబ్బులిచ్చి మరీ ఈ టైటిల్స్‌ని లీక్ చేయిస్తున్నాడట.

ఇప్పటికే మూడు టైటిల్స్ లీక్ చేసిన సదరు పాత్రికేయుడు, వాటిల్లో దేనికి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వస్తే, దాన్ని ఫైనల్ చేస్తారట.

ఈ మధ్య ఇదో వేలం వెర్రిగా మారిపోయింది.! ఇంతకీ ఏంటా సినిమా.? ఎవరా సినీ పాత్రికేయుడు.? అనేది తెలియాల్సి వుంది. బాగా తెలిసిన సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, సదరు యువ నిర్మాత దగ్గర బాగా తినమరిగిన జర్నలిస్టు అని టాక్.!