Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసులో బయటపడిన షాకింగ్ విషయాలు.. చిక్కుల్లో కేటీఆర్?

Janwada Farmhouse: కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలకు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇటీవల అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించడంపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఈ ఫామ్ హౌస్ లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు అయితే అది పుట్టినరోజు వేడుక కాదని అక్కడ రేవ్ పార్టీ జరిగిందని అధికార నేతలు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులు కూడా రైడ్ చేశారు.

ఇక ఈ పోలీస్ రైడ్ లో భాగంగా పార్టీలో పాల్గొన్నటువంటి వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడ డ్రగ్స్ ఉపయోగించారంటూ ఆరోపణలు రావడంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఒకవైపు ఈ పార్టీకి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఈ ఫామ్ హౌస్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫామ్ హౌస్ లో అనుమతులు లేకుండా పార్టీ జరిగిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ఫామ్ హౌస్ ఏ అనుమతి లేకుండా నిర్మించారని అధికారులు కీలక విషయాలను బయటపెట్టారు.

ఇలా ఈ ఫామ్ హౌస్ ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా నిర్మించారనే విషయం తెలియడంతో రాజ్‌పాకాలతో పాటు కేటీఆర్ కూడా చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది.వివరాలన్నీ సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో బయటపడ్డాయి. ఇక బిల్డింగ్‌ నిర్మిస్తున్నప్పుడే అక్రమ కట్టడమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు.

మొదటిసారిగా 2022 జులై ఆరవ తేదీ,అనంతరం జనవరి 2023 30న రెండోసారి, 2023 ఫిబ్రవరి 8న మరోసారి నోటీసులు ఇచ్చామని తెలిపారు. వాటిలో ఒక్క నోటీసుకు కూడా రాజ్‌పాకాల స్పందించలేదని అధికారులు తెలియజేశారు. ఇలా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఈ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అనే విషయం తెలియడంతో అధికారులు కూడా షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.