జగ్గారెడ్డి సరే, మరి కేటిఆర్ మామ సంగతేంటి ? (వీడియో)

 

తప్పుడు పాస్ పోర్ట్ కేసులో జైలుపాలైన జగ్గారెడ్డి విషయం తెలంగాణలో తీవ్రాతి తీవ్రమైన చర్చను లేవనెత్తింది. జగ్గారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అప్పట్లో కొంతమంది టిఆర్ఎస్ ముఖ్యుల సహకారంతోనే అక్రమ రవాణా కు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. 14 ఏండ్ల తర్వాత సరిగ్గా గులాం నబీ ఆజాద్ సభ కు 48 గంటల ముందు జగ్గారెడ్డిని అరెస్టు చేయడం దుమారం రేపుతున్నది. 

అయితే జగ్గారెడ్డి అరెస్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు వైఖరిని, పోలీసుల తీరును తప్పుబడుతుండగా టిఆర్ఎస్ మాత్రం బాగ అయిందంటూ తిప్పికొడుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటున్న నర్సింహ్మ అనే కొడంగల్ పోరడు ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ యువకుడు మాట్లాడిన తీరు జనాల్లో చర్చనీయాంశమైంది.

కొడంగల్ నర్సింహ్మ చెప్పేదేమంటే? నకిలీ పాస్ పోర్ట్ కేసు పేరుతో 14 ఏండ్ల తర్వాత జగ్గారెడ్డి మీద నేరం మొపి అరెస్టు చేశారు సరే, మరి కేటిఆర్ కు పిల్లనిచ్చిన మామ హరినాథరావు పాకాల చిన్నతనంలోనే ఎస్టీ సర్టిఫికెట్ (నకిలీ సర్టిఫికెట్) ద్వారా ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యి ఇప్పటికీ 50వేల పెన్షన్ తీసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నర్సింహ్మ ప్రశ్నించాడు. 

జగ్గారెడ్డికి ఒక నీతి, కేటిఆర్ కు ఇంకో నీతా అని నిలదీశాడు. కేసిఆర్ కు దమ్ముంటే తక్షణమే కేటిఆర్ మామ మీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నర్సింహ్మ కోరుతున్నాడు. నర్సింహ్మ మాట్లాడిన వీడియో పైన ఉంది చూడండి.