అమరరాజా పెట్టుబడులు.. జగన్ సర్కార్ తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే!

CM YS Jagan Mohan Reddy

తెలంగాణ రాష్ట్రంలో 9500 కోట్ల రూపాయల పెట్టుబడుల దిశగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్ సర్కార్ పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ అమరరాజా సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే ఈ సంస్థ ఏపీలో ఏర్పాటయ్యేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. జగన్ సర్కార్ నిర్ణయాలు ఏపీ పరిశ్రమలకు శాపంగా మారాయని మరి కొందరు చెబుతున్నారు.

అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ తెలంగాణలో ఎల్కక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ ను ఏర్పాటు చేసింది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తూ ఉండటం వల్లే తెలంగాణలో పరిశ్రమల సంఖ్య పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమరరాజా పెట్టుబడులు తరలిపోవడం గురించి జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.

అమరరాజా కంపెనీకి సంబంధించిన అమరాన్ బ్యాటరీస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించి తప్పు చేసిందని కొంతమంది చెబుతున్నారు. చిత్తూరులో ఏర్పాటు కావాల్సిన ఈ సంస్థ మరో ప్రాంతానికి తరలిపోవడం చాలామందిని బాధ పెడుతోంది. కొన్ని విషయాలకు సంబంధించి జగన్ సర్కార్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంది.

ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలు అనుకూలంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని గల్లా జయదేవ్ తెలిపారు. ఈ సంస్థ చిత్తూరులో ఏర్పాటై ఉంటే వేల సంఖ్యలో ఉద్యోగులకు బెనిఫిట్ కలిగి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లపై జగన్ సర్కార్ స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.