ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూర్చడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఏపీలో స్కూళ్లను అభివృధ్హి చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 5388 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.
ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్ మేన్ లను నియమించడానికి జగన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖరీదైన ఫర్నీఛర్ ఉండటంతో జగన్ సర్కార్ ఈ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 6 వేల రుపాయల వేతనం అందనుంది. జగన్ సర్కార్ గౌరవ్ వేతనంగా ఈ మొత్తాన్ని ఇవ్వనుందని సమాచారం అందుతోంది.
మాజీ సేవా పురుషులకు, ఎక్స్ సర్వీస్ మేన్లకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీళ్లు అందుబాటులో లేకపోతే పేరెంట్స్ కమిటీ సూచనల ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది. నైట్ వాచ్ మేన్ పోస్టులపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం మరింత పెంచితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.