ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్!

ఏపీలోని నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా 1610 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా 88 పీహెచ్‌సీలు ఏర్పడగా ఇందులో ఉద్యోగాల భర్తీ కోసం 1232 పోస్టులు ఉండగా 63 పీ.హెచ్.సీలలో 378 పోస్టులు ఉన్నాయి. డాక్టర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా త్వరలో నియామకాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలో అధికారులు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని సమాచారం అందుతోంది. అధికారులు వరుస జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం వల్ల నిరుద్యోగులకు ఎంతగానో బెనిఫిట్ చేకూరుతుంది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా సచివాలయ ఉద్యోగాలను భారీ స్థాయిలో భర్తీ చేసే దిశగా అడుగులు వేయడం గమనార్హం.

జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరిన్ని శుభవార్తలు చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.