పశు సంవర్ధక శాఖలో 1,896 వీఏహెచ్‌ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది. 1,896 వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 11వ తేదీ చివరి తేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. డిసెంబర్ నెల 27వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.22,460 వేతనంగా లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 31వ తేదీన అర్హత ఉన్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రొబేషన్ సమయంలో 15,000 రూపాయల వేతనం లభిస్తుంది.

18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.