Jagadish Reddy: కాంగ్రెస్ హయాంలో మళ్లీ ‘హత్యల రాజ్యం’: జగదీశ్ రెడ్డి ఫైర్

Jagadish Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మళ్లీ హత్యల సంస్కృతి పడగవిప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు.

సూర్యాపేటలో ఇటీవల దారుణ హత్యకు గురైన మల్లయ్య భౌతిక కాయానికి బుధవారం జగదీశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల కారణంగా ఓ హత్య జరిగిందని గుర్తుచేశారు. ఆనాడే పోలీసుల నిర్లక్ష్యంపై తాను హెచ్చరించినప్పటికీ, వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఫలితంగానే ఇప్పుడు మరో హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jayasudha On Pawan Kalyan: పవన్ వ్యక్తిత్వంలో ‘నటన’ ఉండదు.. ఆయన రూటే వేరు: జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

Raghu Rama Krishna Raju: ఐపీఎస్ సునీల్ కుమార్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

“గతంలో ఈ గడ్డపై కాంగ్రెస్ నేతలు హత్యలు, దౌర్జన్యాలకు పాల్పడేవారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ విష సంస్కృతిని పూర్తిగా రూపుమాపాం. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఆ హత్యల సంస్కృతిని తిరిగి తీసుకొచ్చింది,” అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావాలనుకున్నారని, అయితే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతో ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని తామే కోరినట్లు వెల్లడించారు.

రాజీనామా | Journalist Bharadwaj About Arnab Goswami On Ram Mohan Naidu & Nara Lokesh | Indigo | TR