ఈ ఏడాది రాజస్థాన్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి పై వివాదాలు మొదలయ్యాయి .
మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నేత లాల్చంద్ కటారియా ఇటీవలే మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించారు.
అలాగే మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉదయపూర్లో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ “10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన మొహం ప్రజలకు బాగా తెలుసు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి పై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు” అని చెప్పారు
దీని పై పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర చైర్మన్ అవినాష్ పాండే స్పందిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతుందని శనివారం వెల్లడించారు.
అలాగే కతారియా వ్యాఖ్యలపై స్పందిస్తూ. “కాతరియా ఒక సీనియర్ నాయకుడు మరియు పార్టీకి ఆయన చేసిన కృషికి మేము గౌరవిస్తాము. ఇటీవలే అయన విడుదల చేసిన ప్రకటనపై తన వివరణను కూడా మేము కోరము ‘అని పాండే చెప్పారు.
మరో పక్క సచిన్ పైలట్ వర్గం తమ నాయకుడు సచిన్ , రాహుల్ గాంధీ తో వున్నా సాన్నిహిత్యంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పక ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నారు .
ఇంకా ఎన్నికలు జరగాలి, కాంగ్రెస్ గెలవాలి , ఈ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలవాలి. ఇవ్వన్నీ ఏమి లేకుండానే సీఎం కుర్చీ పై రుమాలు వేయటం మొదలుపెట్టారు .
దీన్నే మన దగ్గర ఆలు లేదు చూలు లేదు…..కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందంటారు ….