కేంద్రంపై మండిపోతున్న రెండు రాష్ట్రాలు

తాజా బడ్జెట్ పై రెండు రాష్ట్రాలు మండిపోతున్నాయి. ఇటు తెలంగాణా అయినా అటు ఏపి అయినా తమ ఆంకాంక్షలకు బడ్జెట్ లో చోటు కల్పించకపోవటంతో తీవ్ర నిరాసలో ముణిగిపోయాయి. విభజన కారణంగా ఆర్ధికంగా తెలంగాణాకు చాలా అంశాల్లో వెసులుబాటు కన్పించగా ఏపి మాత్రం దారుణంగా దెబ్బతింది.

ఇటువంటి నేపధ్యంలోనే కేంద్రబడ్జెట్ పై తాము ఆశించిన  ప్రయోజనాలుంటాయని ఏపి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అయితే గడచిన ఐదే సంవత్సరాలుగా నిరాసపరిచినట్లే తాజా బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిరాస పరిచింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని బిజిపియేతర  పార్టీలు మూకుమ్మడిగా మండిపోతున్నాయి.

తాజా బడ్జెట్ పై అధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ స్పందించలేదు. అయితే పార్టీ, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజా బడ్జెట్లో ఏపికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని చేసిన వ్యాఖ్యలు చేయటం జగన్ ఆలోచననే ప్రతిఫలిస్తోంది.

ఇక చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు బడ్జెట్ లేదంటూ మండిపడ్డారు.  అభివృద్ధి, పేదల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పటం గమనార్హం. అలాగే వామపక్షాలు, కాంగ్రెస్ కూడా మండిపోతున్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే మొన్నటి వరకూ నరేంద్రమోడి-చంద్రబాబు మధ్య సఖ్యత లేదు కాబట్టి కేంద్రం ఏపిని పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. మరిపుడు మోడి-జగన్ మధ్య సయోధ్య బాగానే ఉన్నా కేంద్రం ఏపిని ఎందుకు పట్టించుకోలేదు ?