తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీస్ రావు తన నియోజకవర్గమైన సిద్ధిపేటలోని ఇబ్రహింపూర్ గ్రామంలో చేసిన కామెంట్స్ పై శనివారం వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో ఆయన ఒక ప్రకటన వెలువరించారు.
భావోద్వేగానికి లోనై చేసిన వ్యాఖ్యలు మాత్రమే అని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యలు చేసింది నిజమే అన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు.
జోరు వానలో గ్రామస్థులంతా అపూర్వ స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. గ్రామస్థుల భిమానం చూస్తుంటే ఇంతకంటే మరేం కావాలని అనిపించిందన్నారు.
భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలు తప్ప మరేం కాదన్నారు. టిఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యత లేదన్న విషయం వాస్తవం కాదన్నారు. తన మీద గిట్టని వారు చేస్తున్న ప్రచారమే అని విమర్శలను కొట్టి పారేశారు హరీష్ రావు.