తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎంత బిజీ అంటే అర్ధరాత్రి, అపరాత్రి కూడా ప్రాజెక్టుల వద్దే మకాం వేస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయడానికి ఆయన తీసుకున్న సమయం జస్ట్ 24 గంటలు మాత్రమే. హరీష్ ఇచ్చిన హామీ ఏంటి? అంత తక్కువ సమయంలో ఎట్లా అమలు చేశారో కింద స్టోరీ చదవండి.
గురువారం నర్సాపూర్ లో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో చెక్ డ్యాంలు మంజూరు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చారు హరీష్. ఏ మంత్రి అయినా హామీ ఇస్తే కొన్ని సందర్భాల్లో అది అమలయ్యేసరికి పుష్కర కాలం కూడా పట్టిన దాఖలాలున్నాయి. మరికొందరు మంత్రులు హామీ ఇచ్చిన తర్వాత వారు మంత్రులుగా వైదొలిగేంతవరకు కూడా అమలు చేయని దాఖలాలు ఉన్నాయి. కానీ హరీష్ రావు మాత్రం 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నారు.
81.94 కోట్లతో హల్దీవాగు, మంజరీ నదిపై 14 చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో హామీని నిలబెట్టుకున్న మంత్రి హరీశ్ రావును ఇరిగేషన్ అధికారులు అభినందనలతో ముంచెత్తారు.
ఈ చెక్ డ్యామ్ ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి.