ఇది చాలా అరుదుగా చూసే సీన్ : మంత్రి హరీష్ రావుని మెచ్చుకున్న వైఎస్ జగన్ ?

YS Jagan appreciates Harish Rao
మంత్రి హరీష్ రావు క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు.  తెరాసలో కేసీఆర్ తర్వాత ఆ స్థాయి ప్రజాబలం ఉన్న వ్యక్తి ఆయనే.  పాలనలో, ప్రజాసేవలో  ఎప్పుడూ ముందుంటారు.  ముఖ్యంగా సిద్ధిపేట జిల్లా వాసులకు ఎప్పుడూ అండగా ఉంటారు.  జిల్లాను ప్రగతి పథంలో పడుపుతున్న ఆయన జనం మీద దృష్టిపెట్టారు.  ప్రభుత్వం అందించే సహకారంతో పాటు ఇంకా ఏదో చేయాలని తపించిన ఆయన తాజాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటుచేశారు.  అప్పులు తెచ్చి ఆటోలు నడుపుతూ రోజువారీ వాడీలు కట్టలేక, సంపాదించిన మొత్తం అప్పులిచ్చిన వారికే ధారబోస్తున్న ఆటోవాలాల కోసం ఈ ఆలోచన చేశారు హరీష్ రావు.  
YS Jagan appreciates Harish Rao
YS Jagan appreciates Harish Rao
రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘంగా ఆ ప్రయత్నం రికార్డు సాధించింది. ఈ సంఘం కోసం సభ్యులు తమ వాటాగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున అందించారు. దీంతో మొత్తం రూ. 8.55 లక్షలు జమ అయ్యాయి.  కానీ ఖర్చులు పోను మిగిలిన డబ్బు మూలధనంగా సరిపోలేదు.  సంఘానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే మార్గం లేకపోవడంతో మంత్రి సొంతంగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు.  డబ్బు సమకూర్చుకోవడం కోసం రంగధాంపల్లిలోని తన ఇంటి స్థలాన్ని మంత్రి బ్యాంకులో తాకట్టు పెట్టారు.   రూ. 45 లక్షలు తెచ్చి ఆటో కార్మికుల సహకార పరపతి సంఘం మూలధనంగా జమచేశారు.  దీంతో ఆటోవాలాలు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఆటోడ్రైవర్ల కోసం సొంత ఆస్తిని తాకట్టుపెట్టి మరీ సహాయం అందించిన హరీష్ రావు మీద రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.  ఇక ఏపీ సీఎం జగన్ సైతం హరీష్ రావు పనిని అభినందించినట్టు చెప్పుకుంటున్నారు.  గతంలో హరీష్ రావు రైతుల మోటార్లకు మీటర్ల అంశంలో జగన్ మీద విమర్శలు చేశారు.  అది పెద్ద దుమారాన్నే రేపింది.  వైసీపీ నేతలు కూడ ప్రతివిమర్శలు చేశారు .  కానీ ఈరోజు హరీష్ రావు చేసింది గొప్ప పని కాబట్టి వాటిని పక్కనపెట్టి అభినందించారట.    జగన్ సైతం ఆటోవాలాల కోసం వాహనామిత్ర పథకాన్ని పెట్టి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అందిస్తున్నారు.  మొత్తం 2.62 లక్షల మంది ఆటోవాలాలకు ఈ లబ్ది  అందుతోంది.  అయితే అదంతా ప్రభుత్వ ధనం.  కానీ హరీష్ రావు సొంత నిధులతో పరపతి సంఘం పెట్టడం జగన్ కు నచ్చిందట.  అందుకే ప్రశంసించారట.