తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్ర విధానాలు ఉన్నాయి అని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బాగున్నాయి అని పార్లమెంటులో కితాబు ఇచ్చిన రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారని అన్నారు.
ఇక తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కేంద్రం కుట్ర చేస్తుందని అన్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం లో సామాన్య ప్రజలు బతకడం కష్టంగా ఉందన్నారు. స్మశాన వాటిక లకు కూడా జీఎస్టీ పెడుతున్నారు అని.. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కేంద్రం 100 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదని అన్నారు. అంతేకాకుండా సీబీఐ, ఈడీ లతో బెదిరింపులకు గురి చేస్తూ భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తుందని అన్నారు.