జగన్ పార్టీ లో ఈ రోజు స్పెషల్ ఆకేషన్ : సందడే సందడి !

AP Govt to distribute 62 thousand acres of land to poor women

 

ఏపీలోని అధికార పార్టీలో నేడు చాల సందడి నెలకొంది.. ఎందుకంటే అధికార వైఎస్సార్ సీపీలో ప‌ద‌వుల పండ‌గ ప్రారంభ‌మైందంటున్నారు.. ఇక ఈ పార్టీలో ఆశావ‌హులు మాత్రం భారీగా ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదీగాక స్థానిక ఎన్నిక‌ల్లో వీరి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆ కోణంలోనూ ప్ర‌భుత్వ వ‌ర్గాలు దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం.. ఇకపోతే పార్టీకి విధేయులుగా ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తూ.. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారట.. అదీగాక రికార్డు స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది..

ఈ మేరకు నేడు భారీ ఎత్తున వివిధ కార్పొరేషన్ లకు సంబంధించిన పదవులను భర్తీ చేయబోతున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. బీసీ కులాలకు సాధ్యమైనన్ని పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఏర్పాటైన 56 కార్పొరేషన్లలో చైర్మన్‌ పదవుల్లో మహిళలకు 29, పురుషులకు 27 దక్కే అవకాశం ఉండగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుందని తెలుస్తుంది..

ఇక వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ కులాలకు కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నారట. డైరెక్టర్‌ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారట. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు కేటాయించడమే కాకుండా కొన్ని జిల్లాలకు 5, 6 పదవులను ఇవ్వబోతున్నట్లు తెలిసింది.. 30 వేలకు పైగా జనాభా ఉన్న కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా లిస్టు తయారు చేసినట్లు సమాచారం.. మొత్తానికి ఈ రోజు వైసీపీలో నెలకొన్న సందడి, సంతోషం ఎందరికి కలిసి వస్తుందో చూడాలి..