ఇకపై ఆధార్ ఉంటేనే పెళ్లి…. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

దేశంలో రోజురోజుకు బాల్య వివాహాల అధికమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ముఖ్యంగా తెలంగాణలో బాల్యవివాహాల అధికమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ముస్లిం అరబ్ షేక్ వివాహాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. అరబ్‌ షేక్‌లు కాంట్రాక్ట్‌ పద్దతిలో మైనర్లను పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై తెలంగాణలో అరబ్ షేక్ వంటి వారు పెళ్లిళ్లు చేసుకోవాలంటే తప్పనిసరిగా వారి ఆధార్ కార్డులను ప్రభుత్వానికి సమర్పించి వారి పెళ్లికి అర్హులైతేనే పెళ్లి చేసుకోవడానికి అనుమతి తెలిపాలంటూ వక్ఫ్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీచేస్తుంది. గతంలో ఖాజీలు ఎలా పడితే అలా వివాహాలు చేసుకునేవారు అయితే ఇకపై అలా కుదరదని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది.

ప్రభుత్వం ఖాజీలకు సైతం హెచ్చరికలు జారీ చేసింది. మైనర్‌, కాంట్రాక్ట్‌ పెళ్లిళ్లు చేస్తే కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పింది. ఖాజీల నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.పెళ్లి చేసుకునే వధూవరులు ఇద్దరు కూడా తమ ఆధార్ కార్డులను సమర్పించే పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇక పెళ్లి జరిగిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఈ వీటన్నింటిని పరిశీలించిన తర్వాతనే సర్టిఫికెట్ జారీ చేయాలనీ తెలిపింది. ఒకవేళ మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లికి కనుక అనుమతి తెలిపితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.