మనం వాహనాలలో ప్రయాణించేటప్పుడు కొన్నిసార్లు మనకు ఎంత కీలకమైన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి వెహికల్ లైసెన్స్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాయి అయితే వీటిని మనం మనతో పాటు వాహనంలో తీసుకువెళ్లడం కష్టతరమవుతున్న నేపథ్యంలో వీటిని డిజీలాకర్ అనే యాప్ లోసేవ్ చేసుకొని అవకాశాన్ని కల్పించారు ఇలా ఈ యాప్ లో సేవ్ చేసుకోవడం వల్ల మనకు ట్రాఫిక్ పోలీసులు ఆపిన వీటిని చూపిస్తే మనం ఎలాంటి ఫైన్ కట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అయితే ఇకపై ఈ యాప్ లో మాత్రమే కాకుండా వాట్సాప్ లో కూడా వీటిని సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది మెటా సంస్థ.
వాట్సాప్ ద్వారా డిజీలాకర్ ఖాతాను యాక్సెస్ చేసే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులు వంటివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అయితే వీటన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు
ఒక ఫోన్ నంబర్ ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జీఓవీ హెల్ప్ డెస్క్ నంబర్ +91 9013151515 ని సేవ్ చేసుకోవాలి.వాట్సాప్ లోకి వెళ్లి మీరు ఏ పేరుతో అయితే సేవ్ చేసారో ఆ పేరుతో సెర్చ్ చేస్తే మనకు డిజీలాకర్ లోగోతో కాంటాక్ట్ కనబడుతుంది. ఇందులోకి వెళ్లి హాయ్ అని టైపు చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి.
డిజీలాకర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఎస్ లేదా నో అనే ఆప్షన్స్ కనబడతాయి. ఒకవేళ మీకు ఇదివరకే ఈ యాప్ కనుక ఉంటే ఎస్ లేకపోతే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే నో పై క్లిక్ చేస్తే మీ పేరు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంటే ముందు డిజీలాకర్ ప్రైవసీ పాలసీని చదివి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 అంకెల గల వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు అప్ లోడ్ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి డాక్యుమెంట్లు సీరియల్ నంబర్ వారీగా కనబడతాయి. వీటిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ ని ఆ డాక్యుమెంట్ తాలూకా నంబర్ ని ఎంటర్ చేస్తే ఆ డాక్యుమెంట్ డౌన్ లోడ్ అయిపోతుంది. వాట్సప్ ద్వారా కూడా ఇకపై ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని భద్రంగా సేవ్ చేసి పెట్టుకోవచ్చు.