పాన్ కార్డు తో ఆధార్ లింక్ కి చివరి గడువు.. వెంటనే లింక్ చేయకపోతే ఆ సర్వీసులు బంద్..?

పాన్ కార్డ్ ఉన్న ప్రతీ ఒక్కరూ దానిని ఆధార్ కార్డ్ తో లింక్ చేయమని కేంద్రం సూచించింది. అయితే ఇప్పటివరకు 80 శాతం మంది మాత్రమే ఆధార్ తో పాన్ లింక్ చేశారు. మిగిలిన వారు కూడా ఆధార్ తో పాన్ తప్పనిసరిగా లింక్ చేయాలని లేదంటే పాన్ కార్డ్ సర్వీసులు నిలిపివేయబడతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు పొడిగించింది. అందువల్ల మార్చి 31 లోగా ఆధార్ తో పాన్ అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు.

బ్యాంకుల ద్వారా అధిక మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరపటానికి పాన్ కార్డ్ చాలా అవసరం. అందువల్ల మీరు పాన్ కార్డు కలిగి ఉన్నట్లు అయితే వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ ని ఆధార్ తో అనుసంధానం చేయకపోతే బ్యాంక్ అకౌంట్ తెరవటానికి కూడా వీలు ఉండదు . అలాగే ఐటీఆర్ దాఖలు చేయలేం. అలాగే టీడీఎస్ కట్ అయ్యేటప్పుడు ఎక్కువగా కట్ అవుతుంది. ఇలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఆన్లైన్ ద్వారా సులభంగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు.

ఆన్లైన్ లో ఆధార్ తో పాన్ లింక్ చేయటానికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పాన్ ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే ఇప్పుడైనా ఆధార్ పాన్ లింక్ చేసుకోండి. ఇప్పటికే లింక్ చేసుకున్నట్లు అయితే లింక్ అయ్యాయా? లేదా? అని స్టేటస్ చెక్ చేసుకోండి. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకునే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. రెండింటిలోనూ వివరాలు ఒకేలా ఉండాలి. వేర్వేరుగా ఉంటే అనుసంధానం కావు.