ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఆ మధ్య ఈటల తాను ముఖ్యమంత్రి అవుతానని సవాల్ విసరడంతో అది కాని పని అని ఇటీవలే టీఆర్ఎస్ నేతలు అన్నారు. దాంతో తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉందని.. ఈసారి వారిని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరని అన్నారు. ఇక తాను గజ్వేల్ లో పోటీ చేస్తానని సవాల్ విసిరానని దానికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలతో తిట్టించారని అన్నారు.
ఇక హుజురాబాద్ లో తను గెలుపొందనని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అంటూ.. తను సిద్ధంగా ఉన్నానని.. కేసీఆర్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని అన్నారు. అంతేకాకుండా ఆయనను ఓడించడమే తన లక్ష్యమని.. లేదంటే తన జన్మకు సార్ధకతే లేదని అన్నారు.