తండా యువకుడిపై టిఆర్ఎస్ ఎర్రబెల్లి ఫైర్ (వీడియో)

పాలకుర్తిలో టిడిపిలో గెలిచిన తర్వత బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. టిడిపిలో శాసనసభా పక్ష నేత పదవిని కట్టబెడితే టిడిపి శాసనసభా పక్షాన్ని గుండుగుత్తగా టిఆర్ఎస్ లో మెర్జ్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో గ్రామ గ్రామానికి బాగా తిరుగుతున్నారు. 
తన పర్యటనలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన సభలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సమయంలో తమ తండాలో అభివృద్ధి లేదు ఏం లేదని ఒక పిలగాడు మైక్ పట్టుకుని స్పీచ్ అదరగొడుతున్నాడు. దీంతో కోపంతో ఎర్రబెల్లి ఆ యువకుడి చేతి నుంచి మైక్ గుంజుకున్నాడు. ఆ యువకుడు మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా మాట్లాడకుండా పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. 
యువకుడితో ఎర్రబెల్లి వాగ్వాదానికి దిగి గరం అయిన వీడియో కింద ఉంది చూడండి.