యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరంగల్ లో ఏజెంట్ మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అగ్ర హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు.. వైల్డ్ వరంగల్. మా అందరికీ మీరంటే పిచ్చి. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు సినిమాలంటే ప్రేమచూపిస్తారు.. ఒక కొత్త జోనర్ తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి గారు అదే కొత్త జోనర్ తో ఒక చక్కటి సినిమా, థ్రిల్లింగ్ సినిమా, స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడలేదు, కథ వినలేదు. కానీ అఖిల్ ఇంట్లో చెబుతుంటే వినేవాడిని. బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. సురేందర్ రెడ్డి గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశారు. అలాగే అనిల్ సుంకర గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. మీరు స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి చాలా మంచి భవిష్యత్ వుండాలి. సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కథ ఓప్పుకున్నారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్ కి పెద్ద హిట్ అవుతుందని ఆనందపడ్డాను. ఇటివలే మమ్ముట్టి గారి మాతృమూర్తి ఫాతిమా గారు కన్నుమూశారు. ఫాతిమా గారి ఆత్మకి శాంతి చేకూరాలి. మమ్ముట్టి గారు ఎంత అంకితభావం కలిగిన నటుడు అంటే.. ఇంత కష్టకాలంలో కూడా డబ్బింగ్ ఫినిష్ చేసి విడుదలకు రెడీ చేశారు. వారికి కృతజ్ఞతలు. ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి (నవ్వుతూ) వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చుస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొట్టలో ఉన్నపుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర వున్నప్పుడు రెస్ట్ లెస్ గా పరిగెత్తేవాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎనర్జీ వుంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందో అంటే .. మా అక్కినేని అభిమానులు. మీరు చూపిస్తున్న ప్రేమ. ప్రతిభ, కష్టం ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, మేయర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ కృతజ్ఞతలు.’’ తెలిపారు
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ… ఈ వేడుకకు విచ్చేసిన మంత్రిగారికి, మిగతా అతిధులందరికీ కృతజ్ఞతలు. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.. ఇక్కడికి వచ్చినందకు థాంక్ యూ నాన్న (నవ్వుతూ). ఏజెంట్ రెండేళ్ళ ప్రయాణం. నేను, సురేందర్ రెడ్డి గారు కలసినప్పుడు ఏదో క్రేజీగా చేసేద్దామనుకున్నాం. క్రేజీగానే చేశాం. ఇంత హైలో పని చేసిన తర్వాత నేను ఏమౌతాననే ప్రశ్న కూడా వుంది. ఏజెంట్ నాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చింది. అనిల్ సుంకర గారు ఏజెంట్ కి బ్యాక్ బోన్. ఎంతగానో సపోర్ట్ చేశారు. సాక్షి కి కృతజ్ఞతలు. ఎడిటర్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ టెక్నికల్ టీం అంతా ఒక మ్యాడ్ నెస్ ఇవ్వాలనే కసితో పని చేశాం. మమ్ముట్టి గారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం, ఆయనతో కలసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, బలం కోసమే నేను పని చేస్తున్నాను. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. ఏప్రిల్ 28న థియేటర్ లో కలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..నాగార్జున గారికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈ వేడుకు అతిధులుగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అఖిల్ గురించే మాట్లాడాలి. ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ బాడీ చేశాడని అందరూ అంటున్నారు. కానీ నేను అఖిల్ లో చూసింది కసి. ఏదో చేయాలి ఏదో సాధించాలనే కసి చూశాను. అదే నన్ను ముందుకు నడిపించింది. అఖిల్ కోసమే ఈ సినిమా చేశాను. అఖిల్ కి ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నాననే నమ్ముతున్నాను. సినిమా చాలా బావుంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా పూర్తి చేశారు. వారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనిల్ సుంకర గారు. ఆయన వలనే ఇంత దూరం రాగలిగాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
సాక్షి వైద్య మాట్లాడుతూ.. నాగార్జున గారికి కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. ఈవేడుకకు నాగార్జున గారు ముఖ్య అతిధిగా రావడం చాలా అనందంగా వుంది. సురేందర్ రెడ్డి గారు లాంటి దర్శకులతో పని చేయడం నా కల నేరవేరినట్లయింది. అనిల్ సుంకర గారికి కృతజ్ఞతలు. అఖిల్ గ్రేట్ కో స్టార్. ఇందులో అఖిల్ ని వైల్డ్ మాసీ యాక్షన్ హీరో గా చూస్తారు. ఏప్రిల్ 28న అందరూ థియేటర్ లో సినిమా చూడాలి’’ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వరంగర్ లో వేడుకలు జరపుకునే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది. వరంగల్ విజయాలకు అడ్డా. ఏజెంట్ కూడా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది అందులో అనుమానం లేదు. నాగార్జున గారు వరంగల్ లో స్టూడియో పెట్టాలని కోరుతున్నాను. మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తాం’’ అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డి ఈ కథ చెప్పినపుడే అఖిల్ ని ఇలా ఊహించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. యువ సామ్రాట్ తో సినిమా చేయాలని అనుకున్నాను. కానీ నేను వచ్చేటప్పటికీ ఆయన కింగ్ అయిపోయారు. మరో యువ సామ్రాట్ తో ఏజెంట్ చేశాం. అఖిల్ తో సినిమా చేయడం,ఈ వేడుకకు నాగార్జున గారు రావడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. మంత్రి దయాకర్ రావు గారికి కృతజ్ఞతలు. సాక్షి వైద్య, డినో మోరియా .. అందరూ చక్కగా చేశారు. మమ్ముట్టి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంటుంది. సినిమాలో మూడు సింహాల ఒకదానితో ఒకటి ఫైట్ చేయడం చూస్తారు. మా యూనిట్, ప్రొడక్షన్ టీంకి కృతజ్ఞతలు. 28 తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అఖిల్ మేజర్ స్టార్. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఇది నా ప్రామిస్. చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు. ఏప్రిల్ 28.. అడవిరాముడు, పోకిరి, బాహుబలి 2.. ఏజెంట్’’ అన్నారు
డినో మోరియా మాట్లాడుతూ… ఏజెంట్ నా మొదటి తెలుగు చిత్రం, అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి లాంటి మంచి టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలకు కృతజ్ఞతలు. సురేందర్ రెడ్డి గారు పాత్రలని కథని అద్భుతంగా తీర్చిదిద్దారు. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ఏప్రిల్ 28న సినిమా వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్ లో చూడాలి”అని కోరారు.