తెలంగాణలోని దుబ్బాకలో త్వరలో ఉపఎన్నికల జరగబోతోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం నెలకొన్నది. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా వేరే ఎన్నికలు కూడా ఉండటంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. వెంటనే ఆయా పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం మీద దృష్టి పెట్టారు.
అయితే.. దుబ్బాక ఉపఎన్నికను మాత్రం బీజేపీ చాలెంజింగ్ గా తీసుకుంది. ఈ ఎన్నికలో గెలిచి బీజేపీ సత్తా ఏమిటో అధికార టీఆర్ఎస్ పార్టీకి చూపించాలనేది బీజేపీ నేతల తాపత్రయం. అందుకే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థి ఎవరనే నిర్ణయం… ఇక్కడ తీసుకునేది కాదట. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరనేది.. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తేనే ఇక్కడ పేరు చెబుతారట.
అంటే.. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఉపఎన్నిక కోసం కూడా కేంద్రం ఇన్వాల్వ్ అవుతోందంటే బీజేపీ తెలంగాణ రాజకీయాల మీద ఎంత ఆసక్తి చూపిస్తోందో అర్థమవుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ ఇన్ చార్జ్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి. ఇదివరకు కూడా రఘునందన్ రెడ్డి బీజేపీ నుంచి దుబ్బాకలో పోటీ చేశారు. కానీ సోలిపేట చేతిలో ఓడిపోయారు. ఈసారైనా సానుభూతితో బీజేపీ అభ్యర్థిని దుబ్బాక ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో బీజీపీ నేతలు ముందడుగు వేస్తున్నారు.