కేటిఆర్, కవిత పై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

తెలంగాణ సిఎం కొడుకు, బిడ్డ కేటిఆర్, కవితపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవళి కూచన సీరియస్ అయ్యారు. తలా తోక లేని వాదనలతో కేసిఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

ఆంద్రోళ్ల ఓట్ల కోసం కేసిఆర్, కేటిఆర్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. మరోవైపు చంద్రబాబును తిడుతూ వివాదం రేపుతున్నారని ఆరోపించారు. మహా కూటమి పొత్తులను చూసి భయంతోనే పిచ్చి పట్టినట్లుగా కేటిఆర్, కవిత, హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేసిఆర్ చంద్రబాబును తిడుతూ ఉంటాడని అన్నారు. మళ్లీ కేటిఆర్ మాత్రం ఆంధ్రోళ్లను జాగ్రత్తగా చూసుకుంటామని మాట్లాడతాడని అన్నారు. కేసిఆర్ ను ఆంధ్రా వాళ్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. టిఆర్ఎస్ నేతలు తమ ఓటమిని అంగీకరించినట్లే అర్థమవుతుందన్నారు. 

అమరావతి కోసం వంద కోట్లు ఇద్దామనుకున్నట్లు మాట్లాడిన కేటిఆర్ పై నిప్పులు చెరిగారు రవళి. అసలు వంద కోట్లు మీ జేబులోంచి ఏమైనా ఇద్దామనుకున్నారా అని నిలదీశారు. తెలంగాణ ప్రజల సొమ్మును మీ తండ్రీ కొడుకులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తండ్రీ కొడుకులను, కూతురును తరిమి తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 

రవళి కూచన ఇంకా ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.