కవితక్కను కలిసిన సోహెల్.. పిక్స్ వైరల్

Bigg Boss Fame Sohel meets Kalvakuntla Kavitha

బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు ఇప్పుడున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ ఒక్కో రకంగా పాపులార్టీ సంపాదించుకున్నారు. టాప్ 5లోకి వచ్చిన అరియానా, హారికల హడావిడి ఎక్కడా కూడా కనిపించడం లేదు. కానీ టాప్ 3లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. విన్నర్‌గా నిలిచిన అభిజిత్ తన దైనందిన జీవితంలో బిజీ అయ్యాడు. రైడింగ్, రేస్‌లంటూ తిరుగుతున్నాడు.

Bigg Boss Fame Sohel meets Kalvakuntla Kavitha

విన్నర్ అయిన అఖిల్ మీడియాలో ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. బయటకు వచ్చాక కూడా మోనాల్‌ను వేసుకునే తిరుగుతున్నాడు. కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. కానీ మూడో స్థానంలో మిగిలి డబ్బులు తీసుకుని బయటకు వచ్చిన సోహెల్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోన్నాడు. కథ వేరే ఉంటది అని చెప్పినట్టుగానే డబ్బులు తీసుకుని ఆటను మార్చేశాడు. అలా మొత్తంగా సోహెల్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు.

బయటకు వచ్చాక కూడా రోడ్ షోలతో సోహెల్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. తన సొంత ఇంటికి వెళ్తున్న ప్రతీసారి భారీ ట్రాఫిక్ జాంలు అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య మళ్లీ అలాగే రోడ్లు మొత్తం బ్లాక్ అయ్యాయి. సోహెల్ క్రేజ్‌కు నిదర్శనంగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసేసి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. కవితక్కతో సోహెల్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్అవుతున్నాయి. మేడంను కలిసే గొప్ప అవకాశం వచ్చిందంటూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.