అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవడం స్నేహ రెడ్డి తల్లికి ఇష్టం లేదా… అందుకే పెళ్లికి అడ్డుపడిందా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఅల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసింది. కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయ్యారు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తను స్నేహ రెడ్డిని ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. స్నేహ రెడ్డి చంద్రశేఖర్ కవిత దంపతుల కుమార్తె చంద్రశేఖర్ విద్యాసంస్థలను నడుపుతూ మరికొన్ని వ్యాపారాలను కూడా చూసుకుంటున్నారు.ఇక స్నేహ రెడ్డి చదువులో ఎప్పుడూ టాపర్ అమెరికాలో చదువును పూర్తి చేసుకుని హైదరాబాదులో తన తండ్రి నిర్వహిస్తున్నటువంటి సెయింట్ ఆన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్ లో పనిచేశారు.

ఇక వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ అయినటువంటి ఫ్రెండ్ పెళ్లిలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇలా ఆ పెళ్లిలో స్నేహ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడటంతో అల్లు అర్జున్ ఫస్ట్ చూపులోనే తన ప్రేమలో పడిపోయాడు. ఇక ఈ పెళ్లిలో స్నేహ రెడ్డితో కూడా మాటలు కలిపారు. స్నేహారెడ్డికి కూడా అల్లు అర్జున్ మొదటి చూపులోనే నచ్చడంతో అతను ప్రపోజ్ చేసే వరకు ఆగిందట.ఇక ఈ విషయం గురించి ఈ కుటుంబ సభ్యులకు తెలియడం వాళ్లు వెళ్లి స్నేహారెడ్డిని పెళ్లి చేసుకుంటామని అడగడంతో అందరూ ఒప్పుకున్నప్పటికీ స్నేహ రెడ్డి తల్లి కవిత మాత్రం ఈ పెళ్లికి అడ్డుపడిందట.

అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అలాంటి వ్యక్తికి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఒక మాట మీద నిలబడరు. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎక్కువగా విడాకులు తీసుకుని విడిపోతుంటారనీ ఈయన కూడా స్టార్ హీరో కనుక ఏ హీరోయిన్ వెంట వెళ్లిపోతే తన కూతురు పరిస్థితి ఏంటి అని ఈమె సందేహాలు వ్యక్తం చేస్తూ తన పెళ్లికి అడ్డుపడ్డారట.అయితే స్నేహ రెడ్డి తనకు నచ్చ చెప్పడంతో చేసేదేమీ లేక ఈ పెళ్లికి ఒప్పుకున్నారట అయితే స్నేహ రెడ్డి తల్లి కవిత ఊహించిన విధంగా తన కూతురి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉండడంతో స్నేహ రెడ్డి తల్లి కూడా చాలా సంతోషపడ్డారని తెలుస్తుంది.