కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అరెస్టు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు బిల్లులకు వ్యతిరేకంగా వరంగల్ ధర్నాలో పాల్గొనేందుకు వీహెచ్ వెళ్తుండగా పెంబర్తి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తనను అరెస్టు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయల చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ లో రైతులు నిర్వహిస్తోన్న ధర్నాలో పాల్గొనడానికి వీహెచ్ వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఆయనను పెంబర్తి వద్ద ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.