భారతదేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు ప్రతి భారత పౌరునికి ఒక గుర్తింపు కార్డు వంటిది. ప్రభుత్వ అందిస్తున్న పథకాల నుండి లబ్ధి పొందటానికి ఈ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేని పౌరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు వర్తించవు. అందువల్ల భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఆధార్ కార్డు జారీపై యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవలు అందిస్తోంది. అయితే తాజాగా పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా ఉండాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆధార్ కార్డు జారీ కోసం తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు.
5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ తీసుకునేందుకు వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ తో దరఖాస్తలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి మరొక ధరకాస్తు ఫారం, 18 ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తులకు మరోక దరఖాస్తు ఫారం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ రకంగా మొత్తం మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ(UIDAI) విడుదల చేసింది. అలాగే ఫిబ్రవరి 15 నుంచి వీటిని అందుబాటులో ఉంచారు. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ(UIDAI) తెలిపింది. అలాగే 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలన్నా.. లేక వాళ్ల ఆధార్ లో ఏమైనా తప్పులను కరెక్షన్ చేయాలన్నా.. తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది.