ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ట్రాప్ లో పడకుండా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి తన రాజకీయ అభద్రతను కాపాడుకునేందుకు చాలా వేషాలు వేస్తున్నాడని, దానికి కాంగ్రెస్ భయపడి పానిక్ అయి ఏ చర్య తీసుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ నుంచి రాష్ట్ర కమిటీకి సూచనలొచ్చాయని సీనియర్ ప్రతినిధి ఒకరు ‘తెలుగు రాజ్యం’ కుచె ప్పారు.
అందువల్ల కాంగ్రెస్ తన పద్ధతిలో తాను పని చేసుకుకుపోవాలని నిర్ణయించింది.టిఆర్ ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా కూడా కాంగ్రెస్ ను బెంబేలు పెట్టేందుకే తప్ప మరొకటి కాదని ఈ సీనియర్ నాయకుడు చెప్పారు. అది ఫైనల్ కాదని, అందులో చాలా మంది ఎగిరిపోతారని, నామినేషన్ వేయడానికి ముందు సర్వే పేరుతో మరి కొంతమంది మారుస్తారని ఆయన చెప్పారు. సిటింగ్ లను ఇపుడే డ్రాప్ చేస్తే రివోల్ట్ వస్తుందని కెసిఆర్ భయపడుతున్నారని ఆయన చెప్పారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను తొందరగా నే నిర్ణయిస్తారు తప్పతొందర పడి నిర్ణయించరని ఆయన చెప్పారు.
టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా తొందర్లోనే ప్రకటిస్తుంది.గ్రేటర్ కు సంబంధించి సగం మంది అభ్యర్థులు పేర్లు అందరికి తెలిసినవే. గోషామహల్ నుంచి మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ , సనత్‌నగర్ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్దన్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక అంబర్‌పేట నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు వి హన్మంతరావు టికెట్ ఆశిస్తున్నరు. ఇదే విధంగా టిపిసిసి బిసి సెల్ నాయకుడు, యువకుడు నూతి శ్రీకాంత్ గౌడ్ కా టికెట్ ఆశిస్తున్నారు. హన్మంతరావు మరొక వైపు తాను ఇక ముందు ఎన్నికల్లో పోటీచేయనని చెప్పారు. ఆయన ఆ మాట నిలబడితే, యువకుడైన శ్రీకాంత్ టికెట్ లభిస్తుంది. పార్టీ లో ఎక్కువ మందిశ్రీకాంత వైపు మొగ్గు చూపుతున్నారు.
వీహెచ్ కూడా చివరి క్షణంలో శ్రీకాంత్ ను బలపరిచే అవకాశం లేకపోలేదు. ఇక ఖైరతాబాద్ ఖాలీగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ మంత్రి, కాంగ్రెస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్‌ఎస్ లో చేరారు. అందువల్ల ఆ నియోజకవర్గం నుంచి రోహిన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజుయాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తికరెడ్డితోపాటు ఆదం సంతోష్‌కుమార్, పల్లె లక్ష్మణ్‌గౌడ్ రేసులో ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి పీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్, పీసీసీ కార్యదర్శి శ్రీగణేశ్ ఆశిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య తనయుడు శ్రీనివా్‌సరెడ్డి దాదాసే ఖరారయింది.
ఈ సీటు కోసమే పీసీసీ కార్యదర్శి కంచె జగదీశ్వర్, మాజీ ఎంపీ అంజన్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ కూడా ప్రయత్నిస్తున్నారు. మలక్‌పేట నుంచి కొత్తకాపు రవీందర్‌రెడ్డి, డి కిషన్, మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు దేప భాస్కర్‌రెడ్డి, చల్ల నర్సింహారెడ్డి పోటీ పడుతున్నారు.
చార్మినార్ నియోజకవర్గం నుంచి మాజీ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్, పీసీసీ కార్యదర్శి వెంకటేశ్ ముదిరాజ్, సెట్విన్ మాజీ డైరెక్టర్ కొప్పుల ప్రవీణ్‌కుమార్ పోటీలో ఉన్నారు. బహుదూర్‌పురా నుంచి మాజీ కార్పొరేటర్ మెరాజ్ మహ్మద్ ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ టికెట్ కోసం తలపడుతున్నారు. శేర్‌లింగంపల్లి సీటును మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ ఆశిస్తున్నారు. కూకట్‌పల్లి నుంచి గొట్టిముక్కల వెంగళరావు, నాగిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి పోటీ బాగా ఉంది. ఈటికెట్ కోసం మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి, ముంగి జయపాల్‌రెడ్డి, బి జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు. ఇక కార్వాన్ టికెట్ కోసం రూప్‌సింగ్, ఉప్పల్ టికెట్‌కావాలని బండారు లక్ష్మారెడ్డి, రాజిడి లక్ష్మారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి వత్తిడి తెస్తున్నారు. మల్కాజిగిరి నుంచి నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్ బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాంపల్లి పోటీచేసేందుకు ఫిరోజ్‌ఖాన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.