టిఆర్ఎస్ దానం నాగేందర్ ఒక డ్రైవర్, దందాలతో వేల కోట్లు

మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ పై పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. ఖైరతాబాద్ ప్రజలు నాకు 15 రోజులు ఆలోచించి నన్ను గెలిపించండి. మీకు సేవ చేసుకుంటా. దానం నాగేందర్ లాగా నాకు చిల్లర రాజకీయం చేయడం రాదు. దానం ఎవరికో డబ్బులు ఇచ్జి నాకు టిక్కెట్ వచ్చేలా చేసాను అని చెబుతున్నాడు. 

నేను భూ కబ్జాలు చేసేవాడిని కాదు. దందాలు చేసే వాడిని కాదు అని దానం కు చెబుతున్నాను. ఒక డ్రైవరుగా ఉండి, దందాలు చేసి రాజకీయాలకు వచ్చి వేలకోట్లు సంపాదించాడు దానం నాగేందర్. దానం నాగేందర్ కు దివంగత నేత పిజెఆర్ పేరు ఉచ్ఛరించడానికి ఏమాత్రం హక్కు లేదు. పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి పిజెఆర్. అలాంటి నేతను మానసికంగా హింసించిన వ్యక్తి దానం. ఆయన చావుకు కారణం అయ్యింది దానం నాగేందరే. 

దానం నాగేందర్ 100కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానం అంటే దందాలు, దౌర్జన్యాలు, దళారి. ఎన్నిరకలుగా చూసినా కాంగ్రెస్ గెలవబోతున్నది. 

రేపు దాసోజు నామినేషన్ (వీడియో)

రేపు దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు. ఈ విషయమై ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.